గరివిడి మండలం వెంకుపాత్రునిరేగలో ఆదివారం రాత్రి ఎస్ ఐ లోకేశ్వరరావు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లెల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రధానంగా యువత సమాజంలో సత్ప్రవర్తనతో నడవాలని కోరారు. రహదారి నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.