గత ఆర్ధిక సంవత్సరంలో డీసీసీబీ బ్యాంకు రూ.7.66 కోట్ల నికరలాభం ఆర్జించినట్లు జెసి ఎస్. సేతుమాధవన్ తెలిపారు. జేసీ అధ్యక్షతన బ్యాంకు మహాజనసభ గురువారం కలెక్టరేట్ లో నిర్వహించారు. బ్యాంకును లాభాల బాటలో నడపడంలో సహకరించిన సహకార సంఘాల సిబ్బందిని, డీసీసీబీ సిబ్బంది, నాబార్డు, ఆప్కాబ్ తదితర బ్యాంకులకు జె.సి. కృతజ్ఞతలు తెలిపారు.