విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చిన్ననడిపల్లి సమీపంలో మృతదేహం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న క్వారీ
గుంత నీటిలో శనివారం ఓ గుర్తు తెలియని మృతదేహం తేలియాడుతుండగా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.