గజపతినగరం మండల కేంద్రం స్థానిక చంపావతి బ్రిడ్జి వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ కె. లక్ష్మణరావు సోమవారం తెలిపారు. అతని వద్ద నుండి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. అక్రమంగా మద్యం తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు.