గజపతినగరం పంచాయతీ రోజువారి మార్కెట్ వేలం పాట గజపతినగరానికి చెందిన సంచాన పైడిరాజుకు ఖరారు చేస్తున్నట్లు గజపతినగరం మండల పరిషత్ పర్యవేక్షణ అధికారి పప్పు సుదర్శనం ప్రకటించారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో మూడోసారి నిర్వహించిన ఆశీలు వేలం పాటలో ఐదుగురు పాటదారులు పాల్గొనగా సంచాన పైడిరాజు 1, 81, 000 రూపాయలకు పాడినట్లు చెప్పారు. సర్పంచ్ నరవ కొండమ్మ, కార్య నిర్వహణ అధికారి మంత్రి రమణ పాల్గొన్నారు.