అలజంగి: చిన్నారులకు బట్టల పంపిణీ

62చూసినవారు
అలజంగి: చిన్నారులకు బట్టల పంపిణీ
బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో నిరుపేద చిన్నారులకు సంక్రాంతి సందర్భంగా శుక్రవారం వనమిత్ర కృష్ణ దాస్ సంక్రాంతి కానుకగా ప్రతి చిన్నారికి జత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. తనకొచ్చిన సంపాదనలో కొంత భాగం పేదలకు పంచడం ఆనందదాయకంగా ఉందనీ తెలిపారు.

సంబంధిత పోస్ట్