జడ్పీటీసీ గజపతినగరం మండలంలోని కొనిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం గజపతినగరం జడ్పీటీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే ఘనమైన నివాళులని అన్నారు. బూడి వెంకటరావు, కొల్లూరు రాజు, పల్లి సంజీవరావు, రమణ నారాయణరావు, రామకృష్ణ కన్నంనాయుడు పాల్గొన్నారు.