మెంటాడ మండలం చింతలవలస గ్రామ సమీపంలోని ఉన్న శ్రీ సంతోషిమాత ఆలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా రెడ్డి శివ సంతోష్ కుమార్, స్నేహ దంపతులు ఆద్వర్యంలో సోమవారం నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్థులు సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు,మాజీ సర్పంచ్ కృష్ణ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.