పెదమానాపురం వద్ద ఆటో కార్మికుల నిరసన

63చూసినవారు
పెదమానాపురం వద్ద ఆటో కార్మికుల నిరసన
దత్తిరాజెరు మండలంలోని పెదమానాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆటో కార్మికులు నిరసన తెలియజేశారు. అఖిలభారత కోర్కెల దినం పురస్కరించుకుని సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలతో దాడికి పూనుకున్నదని ఆరోపించారు. నేతలు ఉమామహేశ్వరరావు, లక్ష్మణరావు, ఈశ్వరరావు, శంకర్, గౌరినాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్