బాడంగి: ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి

1చూసినవారు
బాడంగి: ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆదిపురుషుడైన ఏకలవ్యుడును ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని టిడిపి ఎస్‌టి సెల్‌ జనరల్‌ సెక్రటరీ, గజరాయివలస ఎంపిటిసి పాలవలస గౌరు అన్నారు. ఆదివారం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎరుకుల పాకలు గ్రామంలో ఏకలవ్యుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా గౌరు ఏకలవ్యుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకుల కులస్తుడు అయిన ఏకలవ్యుడు త్యాగ పురుషుడని తన గురువు కోరిన వెంటనే బొటన వేలిని త్యాగం చేసిన ఆదిపురుషుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్