బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయ వార్షికోత్సవం ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ తెలిపారు. 14న ప్రభలు ఘటాలు సమర్పణ తో పాటు శివపార్వతుల కళ్యాణం, 15న ప్రత్యేక వార్షిక బ్రహ్మోత్సవ పూజలు, విశేష గాజుల అలంకరణ, భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు. 16వ తేదీన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయన్నారు.