బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో ఆశ్లేష నక్షత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు పార్వతి దేవిగా పూజలు అందుకున్నారు. అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారికి విశేష కుంకుమార్చన దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.