విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని జగ్గాపురంలో అక్రమ సంబంధం గురించి కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆ గ్రామానికి చెందిన మొయిద అప్పలనాయుడు (42) అనే వ్యక్తి తన ఇంట్లో స్లాబ్ హుక్కుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గంట్యాడ పోలీసులు బుధవారం తెలిపారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.