దత్తిరాజేరు మండలంలోని కోరపు కొత్తవలసలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకం ద్వారా 35 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు జరిపారు. హెల్త్ ఎడ్యుకేటర్ డివి గిరిబాబు ఎంపిహెచ్ఓ మురళి ఆరోగ్య విద్యుత్ అవగాహన కల్పించారు. అనంతరం సాయిరాం భక్తులు పద్మావతి గర్భిణీలు ఆశా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు.