దత్తిరాజేరు మండలంలోని చినకాద గ్రామంలో యువకుడు పాముకాటుకు గురై మృతి చెందినట్లు గ్రామ పెద్ద మురార్జీ గురువారం తెలిపారు. ఈనెల 10వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన ఆవాల సూర్యనారాయణ (31) బహిర్భూమికి వెళ్తుండగా పాముకాటుకు గురైనట్లు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సూర్యనారాయణ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు.