గజపతినగరం మండలంలో ఎంపిక చేసిన పాఠశాలలో జరుగుతున్న టోపిల్ పరీక్షలను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పరిశీలించారు. గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ తో పాటు మరుపల్లి హైస్కూల్, ముచ్చర్ల, పాత శ్రీరంగరాజపురం గ్రామాల్లో పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలలో తాగునీటి సదుపాయం జగనన్న గోరుముద్ద పధకం నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈఓ లు విమలమ్మ సాయి చక్రధర్ పాల్గొన్నారు.