బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయం భూగావెలసిన రాజ రాజశ్రీదేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆలయ ధర్మకర్త ఆదుర్తి రామకృష్ణ విజయలక్ష్మి దంపతులు అమ్మవారికి ప్రభలు ఘటములు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ శివపార్వతుల కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ గావించారు.