బిజెపి గజపతినగరం మండల శాఖ అధ్యక్షునిగా మేటికోటి భాస్కరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ఆరిశెట్టి ఏడుకొండలు స్వగృహం వద్ద జరిగిన సమావేశంలో మండపాక భారతి తవుడు ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ మాజీ మండల అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.