పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించే పథకాలను ప్రజలకు చేరువ చేయాలని గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర అన్నారు. బుధవారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. విజయనగరం డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ సతీష్, సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది పాల్గొన్నారు.