బొండపల్లి మండలంలోని గొట్లాం రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న రాయితీ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు శుక్రవారం తనిఖీ చేశారు. డి కృషి యాప్ ద్వారా విత్తన పంపిణీని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ ఏడాది విత్తన శుద్ధి మందు అందజేస్తున్నట్లు చెప్పారు. గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ మహారాజన్, బొండపల్లి ఏవో మల్లికార్జునరావు, సంతోష్ ప్రియదర్శిని పాల్గొన్నారు.