రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు దేశం పార్టీ మహిళా కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ గజపతినగరంలో నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి వినాయక టెంపుల్ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు తెలుగు మహిళలు సాక్షి దినపత్రికను, ఛానల్ ను బ్యాన్ చేయాలని మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టులు వృత్తికి మచ్చ తెచ్చారని విమర్శించారు.