విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో కేజీబీవీ ఆప్ గ్రేటడ్ జూనియర్ కళాశాలకు మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. బాలికల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. మాజీ జెడ్పిటిసి బండారు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.