ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయాలు జరపాలని ప్రొఫెషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు ఆదేశించారు. గురువారం ధావాలపేట గ్రామంలో గల ఫ్రెండ్స్ వైన్ షాప్ ను తనిఖీ చేశారు. బెల్ట్ షాపు నిర్వాహకులకు మద్యం విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ స్టేషన్ ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఐ జనార్దనరావు ఎస్ఐలు పాల్గొన్నారు.