గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేటు సమీపంలో శుక్రవారం మరుపల్లి గ్రామానికి చెందిన సీర పైడి రాజు (26) కుటుంబ కలహాల కారణంగా పురుగు మందు తాగి చనిపోయినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పురుగు ముందు తాగిన తరువాత ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై మరుపల్లి గ్రామ పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.