ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని గజపతినగరం మండల వ్యవసాయ శాఖ అధికారి కిరణ్ కుమార్ హెచ్చరించారు. శనివారం గజపతినగరంలోని సత్యసాయి ట్రేడర్స్ శివశక్తి ఆగ్రో కెమికల్స్ ఎరువుల దుకాణాలను ఏవో కిరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. నిల్వ వివరాలు, ఈపాస్ మిషన్లో నిల్వ సరఫరా తదితర అంశాలపై నిశితంగా పరిశీలించారు. అనవసర ఎరువులు లింకు పెట్టిన లైసెన్స్ రద్దు అవుతుందని హెచ్చరించారు.