స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 17వ తేదీన వడదెబ్బ జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని గంట్యాడ ఎంపీడీఓ ఆర్.వి రమణమూర్తి బుధవారం తెలిపారు. జన రద్దీ ఉండే ప్రదేశాలలో అలాగే మార్కెట్ల వద్ద టెంపరరీ సెట్లు ఏర్పాటు చేయాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించామన్నారు.