డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సోమవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. గజపతినగరం జడ్పిటిసి గార తౌడు, బెల్లాన త్రినాధరావు బూడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.