గజపతినగరం మండలం గుడివాడ గ్రామంలో శుక్రవారం అమ్మ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంపసప్పల ప్రసాద్ కు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. 20 నెలల క్రితం బైక్ ఆక్సిడెంట్ కారణంగా కుడి కాలు దెబ్బతినడంతో మంచానికే పరిమితమై, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మందులు కూడా కొనలేకపోయాడు. అమ్మ సేవ ఫౌండేషన్ అతని పరిస్థితి తెలుసుకొని రూ. 54,520/- ఆర్థిక సహాయాన్ని గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ కె. కిరణ్ కుమార్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు.