గజపతినగరం మండలం గుడివాడ గ్రామానికి చెందిన ఇంపసప్పల ప్రసాద్ కు 20 నెలల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో కుడికాలు గాయమై మంచానికే పరిమితమయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు అమ్మ సేవ ఫౌండేషన్ తరఫున రూ. 54,520 సహాయం అందించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం యస్‌ఐ కిరణ్ కుమార్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు.