గజపతినగరం మండలంలోని లోగిస గ్రామంలోని ఎస్సీ సమీకృత బాలుర సంక్షేమ వసతి గృహం నిర్వహణ పట్ల గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన వసతి గృహాన్ని సందర్శించి మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయా అని సంక్షేమ అధికారి అప్పలనాయుడును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్యానల్ న్యాయవాది కె సాయిశేఖరరావు పాల్గొన్నారు.