అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు జూలై 9వ తేదీన నిర్వహించనున్న ఒకరోజు సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి కోరారు. బొండపల్లిలో కుమారి అధ్యక్షతన ఆదివారం కార్మికుల సంఘాలతో సమావేశం జరిగింది. మోడీ ప్రభుత్వం 42 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందన్నారు. కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు.