పెంపుడు కుక్కలకు పోషకులు విధిగా రేబిస్ టీకాలు వేయాలని మరుపల్లి పశువైద్యాధికారి అవినాష్ తెలిపారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా గజపతినగరం మండలం మరుపల్లి పశువైద్యశాలలో ఆదివారం పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పశు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.