ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ బొండపల్లి మండలం కనిమెరక క్షేత్ర సహాయకునికి అందజేసిన వినత పత్రంలో డిమాండ్ చేశారు. 10 వారాలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నందున ఇబ్బందులు పడుతున్నామని, పనులు పాత పద్ధతిలో నిర్వహించాలన్నారు. దీంతో పాటు మరో ఏడు సమస్యలు పరిష్కరించాలని కోరారు. గోవింద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.