గజపతినగరంలోని చెత్త నుంచి సంపద కేంద్రంలో బుధవారం ఘన వ్యర్ధాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డి ఎల్ పి ఓ మోహనరావు, ఎంపీడీవో కళ్యాణి మాట్లాడుతూ తడి పొడి చెత్త లను వేరువేరుగా అందజేసి, స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, పంచాయతీ కార్య నిర్వహణ అధికారి జనార్దనరావు, రిసోర్స్ పర్సన్ లు, నాలుగు మండలాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.