అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎం.ఎస్.వి. రవి ప్రసాద్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రమాదాలు వాటి నివారణ చర్యలపై గల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు సమాచారాన్ని తమకు అందించాలని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.