డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు

68చూసినవారు
డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు
గజపతినగరం డిగ్రీ కళాశాలలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ లేకపోతే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మరడాన, డాక్టర్ శ్రీనివాసరావు, అధ్యాపకులు డాక్టర్ మోహన్ రాజు, డాక్టర్ విజయదుర్గ, డాక్టర్ శాంతిప్రియ, శ్రీనివాసరావు, భాను దామోదర్ పైడిరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్