గంట్యాడ: డిసిసిబి బ్యాంకును సందర్శించిన చైర్మన్

6చూసినవారు
గంట్యాడ: డిసిసిబి బ్యాంకును సందర్శించిన చైర్మన్
గంట్యాడలోని డిసిసిబి బ్యాంకును డిసిసిబి జిల్లా చైర్మన్ కిమిడి నాగార్జున శనివారం సందర్శించారు. బ్యాంకు ద్వారా రైతులకు అందుతున్న సేవలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్, జాతీయ బ్యాంకులతో సమానంగా డిసిసిబి బ్యాంక్ పోటీ పడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అలాగే ప్రజలకు ఆర్థిక సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరారు. ఉద్యోగులు పారదర్శకతతో పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్