గంట్యాడ: జులై 6న ఉచిత రేబిస్ టీకాలు

4చూసినవారు
గంట్యాడ: జులై 6న ఉచిత రేబిస్ టీకాలు
జులై 6 న ప్రపంచ జునోసెస్ డే సందర్భంగా ఉచితంగా రేబిస్ టీకాలు వేస్తామని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు రెడ్డి కృష్ణ శనివారం తెలిపారు. గంట్యాడ సబ్ డివిజన్ పరిధిలోని జామి, గంట్యాడ మండలంలోని పెంపుడు కుక్కలకు ఉచితంగా ఈ టీకాలు వేస్తామని అన్నారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వైరస్ లలో ప్రమాదకరమైన వైరస్ రేబిస్ అని ఆయన అన్నారు. పెంపుడు కుక్కలు యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్