గంట్యాడ: ఈనెల 15లోగా రైతులు భూ ఆధార్ నమోదు చేసుకోవాలి

84చూసినవారు
గంట్యాడ: ఈనెల 15లోగా రైతులు భూ ఆధార్ నమోదు చేసుకోవాలి
ఈనెల 15 లోగా భూమి కలిగిన రైతులు (ఫార్మర్ రిజిస్ట్రేషన్) భూ ఆధార్ నమోదు చేసుకోవాలని గంట్యాడ ఏవో శ్యాం కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ. మండలంలో ఇప్పటివరకు 9 వేల మంది రైతులు భూ ఆధార్ నమోదు చేసుకున్నట్లు తెలిపారు. భూ ఆధార్ నమోదు అనంతరం రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య లభిస్తుందన్నారు. ఇది ఉన్నట్లయితే ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ పథకాలను రైతులు సులువుగా పొందవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్