గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో ఆదివారం ఉదయం మిద్దె ఇంటి గోడ కూల్చే సమయంలో మట్టి గోడ పడిపోవడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు అదే గ్రామానికి చెందిన ఎర్ర చెన్నయ్య, కొలుసు పైడితల్లిగా గుర్తించారు. యాత కులానికి చెందిన ఈ ఇద్దరి మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎస్ఐ సాయి కృష్ణ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు.