సమాజంలో గురువులదే కీలకపాత్ర అని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు అన్నారు. గజపతినగరం బిజెపి కార్యాలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయులు ఆరికతోట చంద్రమౌళి, ఎడ్ల పైడుపునాయుడులను సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తిలో వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నేతేటి అప్పలనాయుడు పాల్గొన్నారు.