గజపతినగరంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

77చూసినవారు
గజపతినగరంలో ముమ్మరంగా వాహన తనిఖీలు
గజపతినగరం మండల కేంద్రం స్థానిక నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఎస్సైకె లక్ష్మారావు సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్