విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి మెంటాడ మండలం ఇద్దన వలస గ్రామంలో క్యాంప్ కోర్టు నిర్వహించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ. అనంతరావు శనివారం తెలిపారు. సెక్షన్ కార్యాలయం వద్ద ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం చల్లపీట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరుగుతుంది.