మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గెద్ద పైడిరాజు ఆధ్వర్యంలో, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చలుమూరు వెంకటరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు.