పలు దొంగతనాలకు సంబంధించి అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డిఎస్పి భవ్య బుధవారం సాయంత్రం గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన గుల్లిపల్లి కిరణ్ కుమార్, రావుల రమణ శ్రీను నాయక్ షేక్ బాసాలు 8 షాపుల్లో చోరీ చేసినట్లు చెప్పారు. లాప్ ట్యాఫ్, 9 స్పార్క్ ఫోన్లు, మూడు వాచీలు స్వాధీనం చేసుకున్నారు. సిఐ రమణ, ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.