పదవీకాలంలో చేసిన సేవలే ఉద్యోగులు, అధికారులకు గుర్తింపు ఇస్తాయని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తవుడులు అన్నారు. ఆదివారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మండల పంచాయతీ విస్తరణ అధికారి డి. జనార్ధనరావు, నీరజ దంపతులను ఘనంగా సత్కరించారు. ఎంపీడీవో జయంతి ప్రసాద్, ఏవో పప్పు సుదర్శనం, వైసిపి నాయకులు బెల్లాన త్రినాధరావు, గేదల ఈశ్వరరావు పాల్గొన్నారు.