జామి మండలంలో ఆటో యూనియన్ సభ్యులు ఆదివారం శ్రమదానం కార్యక్రమంలో భాగంగా సేవలు అందించారు. ఇటీవల వర్షాల వల్ల అన్నమరాజుపేట-భీమసింగి రహదారిపై ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, తుప్పలను తొలగించారు. వీటి వల్ల రాహదారిపై వాహనాలు ఎదురెదురుగా కనిపించక ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా ఈ పని చేపట్టారు.