జయతిలో ద్వాదశి జ్యోతిర్లింగాల ప్రతిష్ట స్థాపన కార్యక్రమం

57చూసినవారు
మెంటాడ మండలం జయితి గ్రామంలో 12వ శతాబ్దంలో స్వయంభూగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కార్యక్రమం దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు, వేదుల భువనేశ్వరి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా విగ్నేశ్వరుని ప్రతిష్టించి అనంతరం 12 దేవాలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్