మెంటాడ మండలం పెదమేడపల్లిలో శుక్రవారం ఉపాధి హామీ పథకంలో వేస్తున్న సీసీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా వేస్తున్న సీసీ రోడ్లు కొంతమంది స్థానిక నాయకులు కల్లాలకు, పొలాలుకు వేసుకోవడం విడ్డూరంగా గ్రామానికి చెందిన కాలనీ వాసులు ఆరోపించారు. కాలనీలో ప్రజలు నివాసం ఉంటున్నా కనీసం గ్రావెల్ రోడ్లు కూడా వెయ్యడం లేదని తెలిపారు.