ప్రజలు మూఢనమ్మకాలను విడనాడాలని బొబ్బిలి డిఎస్పి భవ్య శ్రీ కోరారు. మెంటాడ మండలం ఉద్దంగి గ్రామంలో శుక్రవారం మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు శ్రీను, మానసిక వైద్యులు రాజశేఖర్ ఆధ్వర్యంలో సమాజంలో చెడుపు, చిల్లంగి వంటివి లేవని తెలియజేస్తూ ప్రయోగాత్మకంగా ప్రక్రియ చేపట్టారు. సర్పంచ్ కొర్రాయి లక్ష్మి, ఎస్ ఐ కే సీతారాం తదితరులు పాల్గొన్నారు.